మోసగాడు కావాలా.. నీతిపరుడు కావాలా..?.. మేమంతా సభలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 16 |
మోసగాడు కావాలా.. నీతిపరుడు కావాలా..?.. మేమంతా సభలో  సీఎం జగన్  కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెడ్ బెస్క్: మోసగాడు కావాలా అని, నీతి పరుడు కావాలా అని శ్రీకాకుళం జిల్లా అక్కవరం ప్రజలను సీఎం జగన్ ప్రశ్నించారు. మేమంతా సిద్ధం సభలో పాల్గొన్న ఆయన మాజీ సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు ఓటేస్తే తమ పథకాలన్నీ రద్దు అవుతాయన్నారు. సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందించిన చరిత్ర వైసీపీదని చెప్పారు. చంద్రబాబు పొత్తులు పెట్టుకుని దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తనతో పోటీ పడటానికి చంద్రబాబుకు రెండు పార్టీలు కావాలని ఎద్దేవా చేశారు. 2014లో చంద్రబాబు కూటమి ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదని విమర్శించారు. జగన్ కు ఓటస్తే పథకాలన్నీ కొనసాగుతాయని చెప్పారు. నెరవేర్చలేని హామీలు మేనిఫెస్టోలో పెట్టబోనన్నారు. గ్రామ స్వరాజ్యంతో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు. రూ. 87 వేల కోట్ల రుణమాఫీ చేస్తామన్న చంద్రబాబు హామీ ఏమైందని ప్రశ్నించారు. పొదుపు సంఘాల రుణ మాఫీ చేస్తామని చంద్రబాబు చేయలేదని సీఎం జగన్ ఆరోపించారు. ఎన్నికలు అయిన వెంటనే మేనిఫెస్టోను చెత్తబుట్టకే పరిమితం చేసిన చరిత్ర చంద్రబాబుదని ఎద్దేవా చేశారు. కూటమి మోసాలకు చెంప చెళ్లుమనేలా మే 13న తీర్పు ఇవ్వాలని సీఎం జగన్ కోరారు.



Next Story

Most Viewed