- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం జగన్, వైఎస్ఆర్ బొమ్మలతో గెలవాల్సిందే: మంత్రి ఆదిమూలపు సురేశ్
దిశ, డైనమిక్ బ్యూరో : 175 నియోజకవర్గాల్లో ఎవరైనా సరే సీఎం జగన్, వైఎస్ రాజశేఖరరెడ్డి బొమ్మలతో గెలవాల్సిందే అని మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. 175 స్థానాల్లో విజయం సాధించాలంటే తప్పకుండా తగిన గ్రౌండ్ వర్క్ చేసుకోవాలని అందులో భాగంగానే ఇన్‌చార్జిల మార్పులు చేర్పులు జరుగుతున్నాయని అన్నారు. మరోసారి పార్టీ అధికారంలోకి వచ్చేందుకు సీఎం జగన్ గెలుపు గుర్రాలను మాత్రమే ఎంపిక చేస్తున్నారని మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. ప్రకాశం జిల్లాలో మార్పులపై ఇన్‌చార్జి విజయసాయిరెడ్డి, మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిలు కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఒకటి రెండు రోజుల్లో కొత్త ఇన్‌చార్జిలను ప్రకటించే అవకాశం ఉందని అన్నారు. ఒంగోలులో శుక్రవారం మంత్రి ఆదిమూలపు సురేశ్ మీడియాతో మాట్లాడారు. ప్రకాశం జిల్లాలో ఈసారి వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కొండెపి నియోజకవర్గంలోకూడా వైసీపీ జెండా ఎగురేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.మరోవైపు పార్టీలో మార్పుల సహజం అలాంటి వాటిపై టీడీపీ అనవసరమై రాద్ధంతం చేస్తుందని మండిపడ్డారు.టీడీపీ అధినేత చంద్రబాబు చంద్రగిరి నియోజకవర్గం నుంచి కుప్పంకు ఎందుకు మారారని నిలదీశారు. ఎన్టీఆర్, బాలకృష్ణ హిందూపూర్ నుంచి ఎందుకు పోటీ చేశారో సమాధానం చెప్పాలి అని మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రశ్నించారు.