CM Chandrababu:‘వారికి పింఛన్లు ఇవ్వాలి’.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

by Jakkula Mamatha |   ( Updated:2024-12-12 08:55:05.0  )
CM Chandrababu:‘వారికి పింఛన్లు ఇవ్వాలి’.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) రాష్ట్ర అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో తాజాగా సీఎం చంద్రబాబు(CM Chandrababu) కీలక నిర్ణయం తీసుకున్నారు. తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకు కూడా పింఛన్లు(AP Pensions) ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. నేడు(గురువారం) నిర్వహించిన కలెక్టర్ల సదస్సు(Collectors Conference)లో ఈ మేరకు ఆయన సూచించారు. ఇక రానున్న 3 నెలల్లో అనర్హులను గుర్తించి పింఛన్లు కట్ చేయాలని స్పష్టం చేశారు. ఆ తర్వాత కూడా అనర్హులు తేలితే కలెక్టర్లను బాధ్యులను చేస్తానని హెచ్చరించారు.

కాగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6 లక్షల మంది అనర్హులకు పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్(Minister Nadendla Manohar) తెలిపారు. దీంతో అర్హత లేకున్నా పింఛన్లు తీసుకున్న వారి నుంచి అప్పటి వరకు తీసుకున్న పెన్షన్ మొత్తం రికవరీ చేయండి అంటూ సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఆదేశాలు జారీ చేశారు. పింఛన్ల కోసం తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చిన డాక్టర్లను ప్రాసిక్యూట్ చేయండి అన్నారు. పింఛన్ల కోసం మెడికల్ బోర్డుల నుంచి బోగస్ సర్టిఫికెట్స్(Bogus certificates) ఇస్తున్నారు. ప్రత్యేకంగా కొన్ని ఆస్పత్రుల నుంచే ఈ బోగస్ సర్టిఫికెట్స్ ఇస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed