AP:నేడు పెన్షన్ల పంపిణీ..వాలంటీర్లపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

by Mamatha |
AP:నేడు పెన్షన్ల పంపిణీ..వాలంటీర్లపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో నూతనంగా ఏర్పాటైన టీడీపీ కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి పెద్దపీట వేసింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుంది. ఈ నేపథ్యంలో హామీల్లో భాగంగా జూలై 1వ తేదీన ఇంటింటికి వచ్చి పెన్షన్ ఇస్తామని సీఎం చంద్రబాబు చెప్పిన విధంగానే నేడు రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ పండుగ ప్రారంభించారు. సోమవారం ఉదయం 6 గంటలకు ఎన్టీఆర్ భరోసా పేరుతో ఇంటి దగ్గరే పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని పెనమాక గ్రామంలో ప్రారంభించారు. పంపిణీ అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ వలంటీర్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో వలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేశారని, ఎన్నికల కోడ్ వచ్చిన సమయంలో వారిని పెన్షన్లు ఇవ్వకుండా ఎన్నికల కమిషన్ అడ్డుకుందని చెప్పారు. వలంటీర్లతో మాత్రమే పెన్షన్ పంపిణీ చేయించాలనే మూర్ఖత్వంతో ఏప్రిల్, మే నెలల్లో 33 మంది చనిపోయే పరిస్థితిని గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. సచివాలయ సిబ్బందితో పెన్షన్లు ఇప్పించాలని అప్పుడు మేం కోరాం. కానీ వాళ్లు చేయలేదు అని మండిపడ్డారు. ఎందుకు జరగదో చూపిస్తామనే పట్టుదలతో వారితో ఒకే రోజు రాష్ట్రంలో పెన్షన్లు అందిస్తున్నాం అని చెప్పారు. అవసరమైతే వలంటీర్ల సహాయం తీసుకోవాలని చెప్పామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Next Story

Most Viewed