- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
AP News:రేపు రాత్రి ఢిల్లీ వెళ్లనున్న సీఎం చంద్రబాబు..కీలక అంశాలపై చర్చలు!
దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. సోమవారం నుంచి ప్రారంభమైన ఈ సమావేశాలు రేపటితో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు రేపు రాత్రి ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం(జులై 26) రాత్రి 8 గంటలకు చంద్రబాబు ఢిల్లీ చేరుకోనున్నారు. జులై 27న ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కానున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఏపీకి సంబంధించిన అనేక అంశాలపై సీఎం చంద్రబాబు గళం వినిపించనున్నారు.
ఈ క్రమంలో పోలవరం అంశాన్ని కేంద్రం పెద్దల ఎదుట ప్రస్తావించనున్నారు. కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి చర్చలు జరగనున్నాయి. ప్రాజెక్టు ఎత్తు తగ్గించకుండా గతంలో నిర్దేశించిన మేరకే కట్టుబడి ఉండాలని ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశంలో తీర్మానించిన అంశాన్ని కూడా ఆయన కేంద్రానికి వివరించనున్నట్లు సమాచారం. నీతి ఆయోగ్ సమావేశం ముగిసిన అనంతరం అదే రోజు సాయంత్రం సీఎం చంద్రబాబు విజయవాడకు తిరిగి రానున్నారు.