అడవుల్లో అడుగుపెడితే అదే చివరి రోజు.. ఎర్రచందనం స్మగ్లర్లకు చంద్రబాబు వార్నింగ్

by srinivas |   ( Updated:2024-08-30 15:16:55.0  )
అడవుల్లో అడుగుపెడితే అదే చివరి రోజు.. ఎర్రచందనం స్మగ్లర్లకు చంద్రబాబు వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఎర్రచందనం స్మగ్లింగ్‌పై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఎర్రచందనం స్మగ్లర్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఎర్రచందనం స్మగ్లర్లకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. స్మగ్లర్లు అడవుల్లో అడుగు పెడితే అదే చివరు రోజు అని, డ్రోన్లతో వెంటాడతామని చంద్రబాబు హెచ్చరించారు. గత ప్రభుత్వం ఎర్రచందనం స్మగ్లర్లను ప్రోత్సహించిందని మండిపడ్డారు. ఎన్నికల్లో స్మగ్లర్లకు టికెట్‌ ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ తమ ప్రభుత్వం స్మగ్లర్లపై సీరియస్ యాక్షన్ తీసుకుంటుందన్నారు. మంగళగిరి ఎయిమ్స్ సమీపంలో నిర్వహించిన వనమహోత్సవం కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు. ఎకో పార్క్‌లో మొక్కలు నాటారు. రాష్ట్రంలో జరుగుతున్న ఎర్రచందనం స్మగ్లింగ్‌పై చంద్రబాబు స్పందించారు.

Advertisement

Next Story

Most Viewed