త్రికూటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు

by Jakkula Mamatha |
త్రికూటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు
X

దిశ ప్రతినిధి,నరసరావుపేట: సీఎం చంద్రబాబు కోటప్పకొండ లోని త్రికూటేశ్వర స్వామి వారిని దర్శించుకొని పూజలు చేశారు. పల్నాడు జిల్లా యల్లమందలో పేదల సేవలో పాల్గొని అక్కడి నుంచి కొండకు వచ్చారు. ఆలయం వద్ద దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి,జమిందార్ రామకృష్ణ కొండల రావు, దేవాదాయ సెక్రటరీ సత్యనారాయణ వేదపండితులు ఆయనకు పూర్ణ కుంభం తో స్వాగతం పలికారు. చంద్ర బాబు తో పాటు ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్,ఎం.పి. శ్రీ కృష్ణ దేవరాయలు, చీఫ్ విప్ జి వి ఆంజనేయులు,ఎం. ఎల్ ఏ లు,అరవింద బాబు పత్తిపాటి పుల్లారావు, జూలకంటి బ్రహ్మ రెడ్డి,యరపతినేని శ్రీనివాసరావు, కన్నా లక్ష్మి నారాయణ, భాష్యం ప్రవీణ్, మాజీ ఎం.ఎల్. ఏ.లు జంగా కృష్ణమూర్తి, మక్కెన మల్లిఖార్జునరావు,డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు, కలెక్టర్ అరుణ్ బాబు, ఐ జి త్రిపాఠి, ఎస్ పి.శ్రీనివాసరావు ఇతర అధికారులు ఉన్నారు.

Advertisement

Next Story