CBN : ఇకపై నా కాళ్లకు దండం పెట్టొద్దు.. కేడర్‌కు చంద్రబాబు ఆదేశం

by srinivas |   ( Updated:2024-07-13 07:17:44.0  )
CBN : ఇకపై నా కాళ్లకు దండం పెట్టొద్దు.. కేడర్‌కు చంద్రబాబు ఆదేశం
X

దిశ, వెబ్ డెస్క్: ఇకపై తన కాళ్లకు దండం పెట్టొద్దని.. అలా చేస్తే తాను కూడా దండం పెడతానని సీఎం చంద్రబాబు అన్నారు. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజా వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా చంద్రబాబును కలిసేందుకు వచ్చి కొందరు పార్టీ కేడర్ ఆయన కాళ్లకు దండం పెట్టారు. అయితే తన కాళ్లకు దండం పెట్టే సంస్కృతిని వీడాలని చంద్రబాబు సూచించారు. నాయకులకు పార్టీ శ్రేణులు, ప్రజలు దండం పెట్టొద్దన్నారు. తల్లిదండ్రులు, దేవుళ కాళ్లకు మాత్రమే దండం పెట్టాలని, నాయకులకు కాదని సీఎం చంద్రబాబు చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed