- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇక్కడే ఉంటా.. హెల్ప్ లైన్ పెడతా: వరద బాధితులకు చంద్రబాబు భరోసా
దిశ, వెబ్ డెస్క్: బుడమేరు వరద నీరు సింగ్‌నగర్‌ను ముంచేసిందని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడ సింగ్ నగర్, ప్రకాశ్ నగర్, చిట్టీ నగర్ ప్రాంతాల్లో వరద పరిస్థితులను పరిశీలించారు. వరద పరిస్థితి అదుపులోకి వచ్చే వరకూ ఈ ప్రాంతంలోనే ఉంటానని చెప్పారు. హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. వరద బాధితుల బాధలు వర్ణణాతీతంగా ఉన్నాయమని తెలిపారు. బుడమేరు బ్రిడ్జిపై గత పాలకులు నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు.
‘‘మూడు నెలలుగా అధికారులు సైతం నోటీస్ చేయలేకపోయారు. అది ఎప్పుడో క్లోజ్ చేయాల్సి ఉంది. వరద ఫ్లోటింగ్ దెబ్బకు బుడమేరు వాగు ఒక్కసారిగా ఉప్పొంగింది. దీంతో స్థానిక ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఇంత విపత్తు విజయవాడలో చూడలేదు. వరద బాధితులకు అన్ని విధాలుగా ఆదుకుంటాం. వరద ప్రాంతాల్లో బోటులు ఏర్పాటు చేస్తాం. 25 వేల మండికి భోజనాలు ఏర్పాటు చేస్తాం. పునరావాసానికి తరలిస్తాం. ఆరోగ్యం బాగలేని వారికి వైద్యం అందిస్తాం. బిల్డింగ్ ఉన్న వాళ్లు.. వరద బాధితులకు సాయంగా నిలబడాలి. మొదటి అంతస్తులపైనే పునరావాసం ఏర్పాటు చేయండి. గంట గంటకు వరద పరిస్థితులపై సమీక్ష నిర్వహిస్తాం. ప్రతి గంటకు సమాచారం అందిస్తాం’’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.