CM Chandrababu:మాజీ ప్రధాని వాజ్‌పేయికి సీఎం చంద్రబాబు నివాళులు

by Jakkula Mamatha |
CM Chandrababu:మాజీ ప్రధాని వాజ్‌పేయికి సీఎం చంద్రబాబు నివాళులు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu0 నేటి ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడపనున్నారు. ఈ ఉదయం ఆయన మాజీ ప్రధాని వాజ్‌పేయి(Vajpayee) శతజయంతి కార్యక్రమానికి హాజరై నివాళులు అర్పించారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. భారతజాతి గర్వించదగ్గ నేత మాజీ ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పేయీ అని పేర్కొన్నారు. దూరదృష్టి కారణంగా ప్రస్తుతం మన దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతుందని, దేశం గురించి ఆయన ఆలోచించే తీరు విలక్షణమైందన్నారు. సంస్కరణల ప్రతిపాదనలపై ఆయన స్పందించిన తీరు ఎన్నటికీ మరచిపోలేదని వ్యాఖ్యానించారు. ఈ రోజు సీఎం చంద్రబాబు 12.30 గంటలకు బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డా నివాసంలో ఎన్డీయే నేతల సమావేశంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో 5 గంటలకు ప్రధాని మోడీతో(PM Modi) భేటీ అవుతారు. 6 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ప్రత్యేక సమావేశంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

Advertisement

Next Story

Most Viewed