నాకు ఆయనే ప్రాణ భిక్ష పెట్టారు.. సీఎం చంద్రబాబు ఎమోషనల్ కామెంట్స్

by srinivas |   ( Updated:2024-07-13 07:34:42.0  )
నాకు ఆయనే ప్రాణ భిక్ష పెట్టారు.. సీఎం చంద్రబాబు ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా కొలనుకొండ హరేకృష్ణ గోకుల క్షేత్రాన్ని సీఎం చంద్రబాబు నాయుడు సందర్శించారు. వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో భాగంగా అనంతశేష స్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ చీఫ్ జస్టిస్‌తో ఎన్వీరమణతో కలిసి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ మంచి చేసేవారికి ఇక నుంచి రాష్ట్రంలో ఎలాంటి స్పీడ్ బ్రేకర్లు, విధ్వంసాల అడ్డు ఉండదని చెప్పారు. మంచికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా త్వరలో అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. హరేకృష్ణ సంస్థ నేతృత్వంలో దైవ సేవ, మానవ సేవ రెండూ సమానంగా కొనసాగుతున్నాయని చెప్పారు. ఆధ్మాత్మికతతో మానసిక ఆనందం కలుగుతుందని, లేకపోతే ఏ పని చేయలేమన్నారు. దైవత్వాన్ని ప్రతి ఒక్కరిలోనూ పెంపొందించాలని, టెక్నాలజీని అందిపుచ్చుకుంటూనే ఆధ్యాత్మిక సేవను కొనసాగించాలని సూచించారు. శ్రీవారి దయతోనే తాను అలిపిరి బ్లాస్ట్ నుంచి బయటపడ్డానని తెలిపారు. ప్రపంచానికి సేవలందించాలని తనకు వెంకటేశ్వరస్వామి ప్రాణభిక్ష పెట్టారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Advertisement

Next Story
null