Breaking: రెవెన్యూ శాఖ ప్రక్షాళనపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2024-11-29 16:27:33.0  )
Breaking: రెవెన్యూ శాఖ ప్రక్షాళనపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర రెవెన్యూ శాఖ(Department of Revenue)పై సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) కీలక వ్యాఖ్యలు చేశారు. రెవెన్యూ శాఖలో సమూల ప్రక్షాళన చేయాలని అధికారులకు సూచించారు. రెవెన్యూ శాఖపై సమీక్షించిన సీఎం చంద్రబాబు(Cm Chandrababu) రెవెన్యూ సేవలను మరింత సులభతరం చేయాలని సూచించారు. అన్ని సేవలను అన్ లైన్‌ ద్వారా అందించాలన్నారు. ప్రజల దరఖాస్తుల పరిష్కారానికి థర్డ్ పార్టీతో ఆడిట్ చేయాలని రెవెన్యూ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ‘‘ప్రజల భూములు కొట్టేసిన వారిపై కఠినంగా వ్యవహరించాలి. సమస్యలకు తావులేకుండా భూములు రీ సర్వే చేపట్టాలి. ఫ్రీ హోల్డ్ భూముల్లో జరిగిన 7827 ఎకరాల అక్రమ రిజిస్ట్రేషన్లపై విచారణ జరగాలి.’’ అని చంద్రబాబు తెలిపారు.

గత ప్రభుత్వ హయాంలో రెవెన్యూ శాఖలో చాలా అవినీతి జరిగిందని ఎన్నికలకు ముందు టీడీపీ(Tdp), జనసేన (Janasena) నేతలు ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేస్తామని చెప్పారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుండటంతో రెవెన్యూ శాఖపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా రెవెన్యూ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రక్షాళనపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

Advertisement

Next Story

Most Viewed