- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: ఇక నుంచి AI సిటీగా అమరావతి.. సంచలన ఆదేశాలు జారీ
దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయి. గత ఐదేళ్లుగా పిచ్చి చెట్లతో కనిపించిన కేపిటల్ ప్రాంతం ఇప్పుడు కళకళలాడుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధాని ప్రాంత అభివృద్ధిపై దృష్టి పెట్టింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సాయం అందిస్తామని చెప్పడంతో అభివృద్ధి పనుల్లో వేగం పెంచింది. ముందుగా అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఆ ప్రాంతంలో మొలచిన పిచ్చి చెట్లను తొలగిస్తోంది. చాలా వరకూ మొక్కల పీకివేత కార్యక్రమం పూర్తి అయింది. దీంతో రాజధాని ప్రాంతం అందంగా కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు రాజధాని ప్రాంత అభివృద్ధిపైప్రభుత్వం సమీక్షలు నిర్వహిస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.
తాజాగా సైతం రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అమరావతి నిర్మాణంపై వేగం పెంచిన చంద్రబాబు ఉండవల్లిలో సీఆర్డీఏ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. అమరావతి ప్రాంతాన్ని ఏఐ సిటీగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అమరావతిలో మొదటి, చివర అక్షరాలతో AI సిటీగా నామకరణం చేస్తూ నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఈ AI సిటీకి సంబంధించిన లోగోను త్వరగా రూపొందించాలని సీఎం సూచించారు. ఈ సిటీలో 90 రోజుల్లో సీఆర్డీఏ కార్యాలయం నిర్మించాలని, ఇందుకు జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.