Cm Chandrababu: గుడివాడ అన్న క్యాంటీన్‌లో భోజనం చేసిన చంద్రబాబు దంపతులు

by srinivas |   ( Updated:2024-08-15 08:06:09.0  )
Cm Chandrababu: గుడివాడ అన్న క్యాంటీన్‌లో భోజనం చేసిన చంద్రబాబు దంపతులు
X

దిశ, వెబ్ డెస్క్: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు గుడివాడలో అన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు. అంతేకాదు క్యాంటీన్‌లో భోజనం చేశారు. టీడీపీ నేతలు, సతీమణి నారా భువనేశ్వరితో కలిసి ఆయన పేదలకు అన్నం వడ్డించారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. అప్యాయంగా పలకరిస్తూ భోజనం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, పాలనపైనా వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.

కాగా ఈ అన్న క్యాంటీన్‌లో రూ. 5 లకే మూడు పూటల ఆహారం లభిస్తుంది. గుడివాడతో పాటు రాష్ట్రంలో పలుచోట్ల టీడీపీ నేతలు అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. ఈ క్యాంటీన్లు మళ్లీ రీ ఓపెన్ కావడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఉదయం టిఫెన్‌తో పాటు మధ్యాహ్నం, రాత్రి భోజనం దొరుకుతుందని ఆనందం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story