కుప్పం యువతికి సీఎం చంద్రబాబు అభినందన

by srinivas |
కుప్పం యువతికి సీఎం చంద్రబాబు అభినందన
X

దిశ, ఏపీ బ్యూరో అమరావతి: మిస్ యూనివర్స్-ఇండియాకు ఏపీ నుంచి చందన జయరాం అర్హత సాధించారు. దీంతో సీఎం నారా చంద్రబాబు నాయుడుని శుక్రవారం సచివాలయంలో ఆమె కలిశారు. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం, ఎం.కె.పురానికి చెందిన చందనా జయరాం ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన పోటీల్లో మిస్ యూనివర్స్ ఇండియాకు రాష్ట్రం నుండి ఎంపికయ్యారు. ముంబైలో జరిగే మిస్ యూనివర్స్ ఇండియా పోటీల్లో ఏపీ నుంచి చందనా పాల్గొననున్నారు. కుప్పం నుంచి చందనా జయరాం మిస్ యూనివర్స్-ఇండియా పోటీలకు అర్హత సాధించడంపై ఆమెకు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు.

Advertisement

Next Story