- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CM Chandrababu: రేపు పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకు సీఎం చంద్రబాబు.. ప్రధాన కారణం అదే!
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ (Polavaram Project)పై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే రేపు ప్రాజెక్టును సీఎం చంద్రబాబు (CM Chandrababu), జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడి (Minister Nimmala Ramanayudu)తో కలిసి సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ పనులను వారు క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నారు. అనంతరం ఇంజినీరింగ్ విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
సమీక్షలో భాగంగా పోలవరం ప్రాజెక్ట్ (Polavaram Project) నిర్మాణ పనులకు సంబంధించి షెడ్యూల్‌ను కూడా విడుదల చేయనున్నారని అధికారులు వెల్లడించారు. అదేవిధంగా జనవరి 2 నుంచి ప్రారంభించబోయే కొత్త డయాఫ్రం వాల్ (Diaphragm Wall) పనులు గురించి ఇంజినీర్లను అడిగి తెలుసుకోనున్నారు. పోలవరం ప్రాజెక్ట్ (Polavaram Project)ను పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం (Central Government) ఇటీవలే రూ.15 వేల కోట్ల నిధులను ప్రకటించింది. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు (CM Chandrababu) సమీక్ష అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏమాత్రం జాప్యం చేయకుండా పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలంటూ ఇప్పటికే సీఎం అధికారులను ఆదేశించినట్లుగా తెలుస్తోంది.