Ap News:అన్ని వర్గాలకు నాణ్యమైన విద్యుత్ అందిస్తాం..స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు

by Jakkula Mamatha |   ( Updated:2024-07-15 06:13:51.0  )
Ap News:అన్ని వర్గాలకు నాణ్యమైన విద్యుత్ అందిస్తాం..స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో నూతనంగా ఏర్పడిన టీడీపీ కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ప్రజా సంక్షేమానికై పలు కార్యక్రమాలను తీసుకొస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ‘మిషన్ లైఫ్’ కార్యక్రమానికి సంబంధించి బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) సలహాదారు చంద్రశేఖర్‌రెడ్డి రూపొందించిన పోస్టర్‌ను సీఎం విడుదల చేశారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ..రాష్ట్రంలో ఇళ్లు, పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్తును అందిస్తామని తెలిపారు. ఇంధన సామర్థ్య నిర్వహణకు సాయం చేసే ఉపకరణాల వినియోగం పై ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అన్ని వర్గాలను ఆదుకుంటామని సీఎం హామీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed