CM Chandrababu:సతీమణి భువనేశ్వరి కోసం చీరలు కొన్న సీఎం చంద్రబాబు!

by Jakkula Mamatha |   ( Updated:2024-08-07 12:53:23.0  )
CM Chandrababu:సతీమణి భువనేశ్వరి కోసం చీరలు కొన్న సీఎం చంద్రబాబు!
X

దిశ,వెబ్‌డెస్క్:రాజకీయాలు, అధికారుల సమావేశంలో నిత్యం బిజీగా ఉండే సీఎం చంద్రబాబు నేడు (బుధవారం) షాపింగ్ చేశారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. చేనేతకారులు సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విజయవాడలోని స్టెల్లా ఆడిటోరియంలో చేనేత ఎగ్జిబిషన్‌ని ప్రారంభించారు. విజయవాడ స్టెల్లా ఆడిటోరియంలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను నేడు పరిశీలించారు. ఈ క్రమంలో బాగుందంటూ ధర్మవరం చీరను, డిజైన్ నచ్చడంతో పక్కనునన్న స్టాల్‌లో ఉప్పాడ చీరను భార్య భువనేశ్వరి కోసం సీఎం చంద్రబాబు స్వయంగా కొన్నారు. ఆ తర్వాత ఓ స్టాల్ నిర్వాహకుడితో మాట్లాడిన ఆయన చేనేతల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed