ఏపీని ఆదుకోండి.. కేంద్రపెద్దలకు చంద్రబాబు వేడుకోలు

by srinivas |
ఏపీని ఆదుకోండి.. కేంద్రపెద్దలకు చంద్రబాబు వేడుకోలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన బిజీ బిజీగా సాగింది. ఏపీకి రావాల్సిన నిధుల విడుదలే లక్ష్యంగా సీఎం చంద్రబాబు హస్తిన బాటపట్టిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీతో పాటు కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్‌, అమిత్ షాను కలిశారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ఇచ్చిన హామీలను వారి దృష్టి తీసుకెళ్లారు. త్వరగా నిధులు విడుదల చేయాలని కోరారు. రాజధాని పున:నిర్మాణం, పోలవరం నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. వెనుకబడిన జిల్లాలకు ప్రకటించిన ప్యాకేజీ అంశాన్ని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్ట్ విషయంపైనా చంద్రబాబు చర్చించారు. పోలవరం పూర్తికి నిధులు విడుదల చేయాలని కోరారు. రాష్ట్ర విభజన హామీలపై కేంద్రమంత్రి అమిత్ షాతో చంద్రబాబు చర్చించి... త్వరగా నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. పనిలో పనిగా కేంద్రమంత్రి కుమారస్వామిని సైతం చంద్రబాబు కలిశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధిపై చర్చించారు.

Advertisement

Next Story