‘ఎట్ హోమ్’ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం

by Jakkula Mamatha |   ( Updated:2024-08-15 15:55:21.0  )
‘ఎట్ హోమ్’ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం
X

దిశ,వెబ్‌డెస్క్: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విజయవాడ రాజ్‌భవన్‌లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ‘ఎట్ హోమ్’ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ తేనీటి విందు ఇచ్చారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌తో పాటు మంత్రులు నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల, హైకోర్టు జడ్జిలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు, వివిధ పార్టీల నేతలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈ ప్రొగ్రామ్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ మంత్రులను గవర్నర్ కు పరిచయం చేశారు.

Advertisement

Next Story