- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భువనేశ్వరి ప్రజల్లోకి వస్తుందని సీఎంకు, మంత్రులకు మతి చలించింది: పీతల సుజాత
దిశ, డైనమిక్ బ్యూరో : అభివృద్ధి, సంక్షేమం తప్ప మరేమీ పట్టని మచ్చలేని నాయకుడు.. ప్రజల సుఖ సంతో షాల గురించి ఆలోచించే నిస్వార్థ నాయకుడు చంద్రబాబు నాయుడు అని మాజీమంత్రి పీతల సుజాత అన్నారు. చంద్రబాబును అన్యాయంగా జైలుకు పంపిన జగన్ , అతని ప్రభుత్వం నిత్యం టీడీపీ అధినేతపై దుష్ప్రచారం చేస్తూ, వెర్రిమొర్రి ఆనందం పొందుతోందని మాజీ మంత్రి పీతల సుజాత అన్నారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం మాజీమంత్రి పీతల సుజాత మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబం గురించి మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు నోటికి అడ్డు, అదుపు లేకుండా పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు అని మండిపడ్డారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ప్రజల్లోకి వెళ్లడాన్ని తప్పుపడుతున్న మంత్రి అంబటి రాంబాబు.. గతంలో వైఎస్ విజయమ్మ ఎందుకు ఓదార్పు యాత్ర చేసిందో, జగన్ వదిలిన బాణాన్ని అంటూ ఆయన చెల్లి షర్మిల ఎందుకు పాదయాత్ర చేసిందో సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ మరణంతో ఎన్నో గుండెలు ఆగిపోయాయంటూ విజయమ్మ చేసిన యాత్ర అంతా బూటకమని రాంబాబు ఉద్దేశమా? అని నిలదీశారు. వైఎస్ఆర్ చనిపోయినప్పుడు ఆయనపై అభి మానంతో ప్రజలు ఎవరూ చనిపోలేదని.. కేవలం తన ప్రయోజనాలకోసం జగన్మోహన్ రెడ్డి ఆనాడు అబద్ధం చెప్పాడన్నది అంబటి రాంబాబు అభిప్రాయమా? అని నిలదీశారు. అధికారంలో ఉన్నామన్న అహంకారంతో గతం, వర్తమానం మరిచి మాట్లాడితే, దానికి రెట్టింపు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనే వాస్తవాన్ని మంత్రి అంబటి రాంబాబు గ్రహించాలి అని మాజీమంత్రి పీతల సుజాత హెచ్చరించారు.
వైఎస్ జగన్ గజదొంగ
చంద్రబాబు ఆరోగ్యంతో ఆయన కుటుంసభ్యులు, టీడీపీనేతలే అబద్ధాలాడుతూ, సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారంటున్న మంత్రి అంబటి రాంబాబు విమర్శలు చేయడం సిగ్గుచేటని మాజీమంత్రి పీతల సుజాత అన్నారు. ‘గతంలో జగన్ కూడా అలానే చేశాడన్న ఆలోచనతోనే అలా మాట్లాడారా? సానుభూతి కోసం పాకులాడి... ప్రజల్ని తమ స్వార్థానికి వాడుకోవడం వైసీపీనేతలకు, ముఖ్యమంత్రికి తెలిసినంతగా ఎవరికీ తెలియదు అని విమర్శలు చేశారు. జగన్మోహన్ రెడ్డి బాబాయ్ హత్యకేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అవినాశ్ రెడ్డిని కాపాడటంకోసం ఆయన తల్లిని అడ్డం పెట్టి రాజకీయాలు చేయలేదా? అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వచ్చిన సీబీఐ వారికి పోలీసుల్ని అడ్డు పెట్టి, కేంద్రదర్యాప్తు సంస్థ అధికారుల్ని భయభ్రాంతులకు గురిచేయలేదా? 16 నెలలు తాను జైల్లో ఉన్నాడు కాబట్టి.. జగన్ ఏదోరకంగా చంద్రబాబుని జైలుకు పంపాలని కుట్రలకు పాల్పడి, రాజ్యాంగవ్యవస్థల్ని గుప్పిట్లో పెట్టుకొని తాను అనుకున్నది చేయ గలిగాడు. జగన్ రెడ్డి నీతిమాలిన రాజకీయాలను సమర్థిస్తున్న అంబటి రాంబాబు లాంటి మంత్రులకు, వైసీపీనేతలకు మొసళ్ల పండగ ముందుంది. లక్షలకోట్ల ప్రజల సొమ్ము దోచేసిన జగన్మోహన్ రెడ్డి పెద్ద గజదొంగ అయితే, అంబటి లాంటి మంత్రులు చిల్లరదొంగలు. తమకు అంటిన అవినీతి మరకల్ని చంద్రబాబుకి అంటించాలని జగన్ రెడ్డి అండ్ కో తాపత్రయపడుతున్నారు’ అని పీతల సుజాత అన్నారు.