భారీ వర్షాల ఎఫెక్ట్.. పండమేరు వాగు పాత బ్రిడ్జి మూసివేత

by Mahesh |
భారీ వర్షాల ఎఫెక్ట్.. పండమేరు వాగు పాత బ్రిడ్జి మూసివేత
X

దిశ, వెబ్‌డెస్క్: బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా రాయలసీమ, అనంతపురం జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. దీంతో అనంతపురం(anantapuram) జిల్లాలోని పలు గ్రామాల్లో ఆకస్మాత్తుగా భారీ వరదలు వచ్చాయి. దీంతో చెరువుల కట్టలు తెగడంతో పలు గ్రామాలు నీటిలో మునిగిపోయాయి. ఈ క్రమంలో పండమేరు వాగు( Pandameru vagu)కు భారీ వరద పోటెత్తింది. దిగువన వరద ఉధృతి అధికంగా వచ్చింది. అనంతరం వరదలు తగ్గినప్పటికీ పాత బ్రిడ్జి వాహనాలు వెళుతుంటే ఊగుతుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు పాత బ్రిడ్జి(old bridge)ని మూసివేశారు. అలాగే దానికి మరమ్మత్తులు చేయాలని నిర్ణయించారు. అలాగే పక్కనే ఉన్న కొత్త బ్రిడ్జిపై యదాతదంగా రాకపోకలు కొనసాగుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed