Classification of SC subcastes: జస్టిస్ ఎన్వీ రమణతో మంద కృష్ణ మాదిగ భేటీ

by Ramesh Goud |
Classification of SC subcastes: జస్టిస్ ఎన్వీ రమణతో మంద కృష్ణ మాదిగ భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణతో ఎమ్ఆర్ పీఎస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ భేటీ అయ్యారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణకు సుప్రీం కోర్టులో తీర్పు వెలువడిన సందర్భంగా మంద కృష్ణ మాదిగ మాజీ చీఫ్ జస్టిస్ ను సత్కరించారు. ఎన్వీ రమణ సీజేఐగా ఉన్న సమయంలోనే సుప్రీం కోర్టులో ఎస్సీ వర్గీకరణ అంశానికి సంబందించిన కేసు విచారణకు వచ్చిందని, పంజాబ్ ప్రభుత్వం దాఖలు చేసిన కేసును విచారణకు అనుమతించి, సీజేఐగా 5 గురు సభ్యుల ధర్మాసనానికి పంపారని గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణ కేసును సుప్రీంకోర్టు లో అనుమతించినందుకు ఎన్వీ రమణకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఎస్సీ వర్గీకరణ కోసం ఉద్యమించినందుకు మంద కృష్ణ మాదిగ బృందాన్ని మాజీ సీజేఐ ఎన్వీ రమణ అభినందించారు. కాగా ఎస్సీ ఉపకులాల వర్గీకరణకు ఆమోదం తెలుపుతూ.. సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇందులో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరించుకునే అధికారం రాష్ట్రాలకు ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేశింది.

Advertisement

Next Story