- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వర్గపోరు: గుడివాడలో జనసేన పార్టీకి షాక్..కీలక నేత రాజీనామా
దిశ, డైనమిక్ బ్యూరో : కృష్ణా జిల్లా గుడివాడలో జనసేన పార్టీకి బిగ్ షాక్ తగిలింది. జనసేన పార్టీకి యువనేత డా.మాచర్ల రామకృష్ణ రాజీనామా చేశారు. ఆర్కేతో పాటు ఆయన అనుచరులు సైతం జనసేన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సిద్ధాంతాలునచ్చి తాను జనసేన పార్టీలో చేరడం జరిగిందని తెలిపారు. పదేళ్లుగా పవన్ కల్యాణ్ పేరు జపిస్తూ జెండాను భుజాలపై మోసినట్లు వెల్లడించారు. యువతతో కలిసి పార్టీ పేరు మీద వేలాది సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. అంతేకాదు కరోనాలాంటి విపత్కర సమయంలో అనాథ శవాలకు సైతం అంత్యక్రియలు నిర్వహించినట్లు తెలిపారు. నిత్యం రోడ్లపై ఉంటూ ప్రజాసేవలో సైనికుల మాదిరి గర్వంగా పనిచేసినట్లు తెలిపారు. మాచర్ల రామకృష్ణగా కంటే జనసేన ఆర్కేగా తనకు గుర్తింపు వచ్చిందని అన్నారు. తనకు పవన్ కల్యాణ్ అంటే విపరీతమైన అభిమానం అని అయితే స్థానికంగా ఉండే గ్రూపు రాజకీయాల వల్ల తాను జనసేన పార్టీకి గుడ్ బై చెప్పాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఒక సామాజిక కార్యకర్తగా తాను చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఇటీవలే డాక్టరేట్ వచ్చిందని చెప్పుకొచ్చారు. అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లా కలెక్టర్ కూడా తన సేవలను గుర్తించి అభినందించారని స్పష్టం చేశారు. తన సేవలను అంతా గుర్తించారు కానీ జనసేన పార్టీ గానీ.. స్థానికంగా ఉండే నాయకులు గానీ గుర్తించలేకపోయారని అన్నారు. తాను కేవలం స్థానికంగా ఉండే గ్రూపు రాజకీయాలను తట్టుకోలేకే జనసేన పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో పదిమందికి మేలు చేసే వ్యక్తులకు మద్దతుగా నిలుస్తానని తెలిపారు. గుడివాడ పట్టణ ప్రజలకు మంచి జరగడమే తన అంతిమ లక్ష్యంగా పనిచేస్తానని డా.మాచర్ల రామకృష్ణ వెల్లడించారు.