Breaking మెగాస్టార్ తో సినిమాటోగ్రఫీ మంత్రి భేటీ..

by Indraja |
Breaking మెగాస్టార్ తో సినిమాటోగ్రఫీ మంత్రి భేటీ..
X

దిశ, డైనమిక్ బ్యూరో: నిన్న రాత్రి కేంద్ర ప్రభుత్వం 2024 పద్మ పురస్కారాలను ప్రకటించిన విషయం అందరికి సుపరిచితమే. కాగా తెలుగు చిత్ర పరిశ్రమ నుండి మెగాస్టార్ చిరంజీవి పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నారు. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు చిరంజీవికి అభినందనలు తెలియచేసారు. కాగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి, ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజుతో కలిసి జూబ్లీహిల్స్ లోని చిరంజీవి ఇంటికి వెళ్లారు.

అనంతరం చిరంజీవిని కలిసిన మంత్రి కోమటిరెడ్డి, సినీ నిర్మాత దిల్ చిరంజీవికి శాలువ కప్పి.. పూల గుచ్చం అందచేసి అభినందనలు తెలియచేసారు. ఈ సందర్భంగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి మాట్లాడుతూ.. తెలుగు చిత్ర పరిశ్రమ నుండి మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు రావడం చాల ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.

మెగాస్టార్ చిరంజీవిని పద్మ విభూషణ్ అవార్డు వరించడంతో మెగా అభిమానుల ఆనందం అంబరాన్ని అంటిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. చిరంజీవికి అవార్డు వచ్చిన నేపథ్యంలో మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా హలచల్ చేస్తున్నారు. చిరంజీవి ఫొటోలు, వీడియోలతో సోషల్ మీడియా లో మెగా అభిమానులు హోరెత్తిస్తున్నారు.

Advertisement

Next Story