గుడ్ న్యూస్.. జనసేన ఎమ్మెల్యే అభ్యర్థికి సినీ హీరో మద్దతు (వీడియో)

by GSrikanth |
గుడ్ న్యూస్.. జనసేన ఎమ్మెల్యే అభ్యర్థికి సినీ హీరో మద్దతు (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ జనసేన పార్టీకి తెలుగు సీనియర్ హీరో మద్దతు ప్రకటించారు. ఈ మేరకు తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్‌ను కలిశారు. ఈ సందర్భంగా బొలిశెట్టి గెలుపునకు కృషి చేస్తానని ప్రకటించారు. ‘బొలిశెట్టి శ్రీనివాస్ నిస్వార్థమైన నాయకుడు. ప్రజల కోసం సొంత డబ్బును ఖర్చు చేసేంత తెగింపు ఉన్న వ్యక్తి. అలాంటి ఇప్పుడు ప్రజలకు కావాలి. అందరూ ఆయనకు ఓటు వేసి గెలిపించాలి’ అని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. కాగా, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ పార్టీలు ఉమ్మడిగా పోటీ చేస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వాన్ని పడగొట్టడమే లక్ష్యంగా పెట్టుకొని వ్యూహాత్మకంగా నడుచుకుంటున్నాయి. ఈ క్రమంలో జనసేన పార్టీ పి.గన్నవరంతో పాటు 22 స్థానాల్లో పోటీ చేస్తోంది. జనసేన అధినేత పవన్ కల్యాన్ పిఠాపునం నుంచి బరిలోకి దిగుతున్నారు.


Advertisement

Next Story

Most Viewed