టీటీడీ కీలక నిర్ణయం.. నిధులు మంజూరు చేస్తూ ప్రకటన

by srinivas |   ( Updated:2023-04-15 16:22:19.0  )
టీటీడీ కీలక నిర్ణయం.. నిధులు మంజూరు చేస్తూ ప్రకటన
X

దిశ, తిరుపతి: తిరుపతి స్విమ్స్‌ పరిధిలోని శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాలలో టీబీ, చెస్ట్, స్కిన్ ఇతర ఐసోలేషన్ వార్డులు, స్టాఫ్ క్వార్టర్స్, హాస్టళ్ల నిర్మాణ పనుల కోసం రూ.53.62 కోట్లు మంజూరు చేసినట్టు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి తెలిపారు. టీటీడీ ధర్మకర్తలమండలి సమావేశం తిరుమల అన్నమయ్య భవనంలో జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఛైర్మన్ మీడియాకు వెల్లడించారు. అవి ఆయన మాటల్లోనే టీటీడీ అవసరాలకు ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన 12 రకాల ఉత్పత్తుల కొనుగోలుకు ధరల నిర్ణయంపై రైతు సాధికార సంస్థ, మార్క్ ఫెడ్‌తో చర్చించేందుకు టీటీడీ బోర్డు సభ్యులు డా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సనత్ కుమార్, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డితో కమిటీ ఏర్పాటు చేసామని చెప్పారు. అలిపిరి మార్కెటింగ్‌ గోడౌన్‌ వద్ద నూతన గోడౌన్ల నిర్మాణానికి రూ.18 కోట్లు, కోల్డ్‌ స్టోరేజి నిర్మాణానికి రూ.14 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు.

గుంటూరుకు చెందిన దాత శ్రీమతి ఆలపాటి తారాదేవి రూ.10 లక్షలతో వెండి కవచాన్ని శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి అందించేందుకు ఆమోదం తెలిపారన్నారని వైవి.సుబ్బారెడ్డి తెలిపారు. ‘ తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ ఆలయ ఆధునీకరణ పనులకు రూ.3.12 కోట్లతో టెండరుకు ఆమోదం తెలపడం జరిగింది. న్యూఢిల్లీలోని ఎస్వీ కళాశాలలో ఆడిటోరియం అభివృద్ధి పనుల కోసం రూ.4 కోట్లు మంజూరుకు ఆమోదం చెప్పారు. టీటీడీ విద్యాసంస్థల్లో రెగ్యులర్‌ బోధనా సిబ్బంది నియామకానికి ఆమోదం తెలిపారు. ఇప్పటికే పని చేస్తున్న కాంట్రాక్ట్ బోధనా సిబ్బందిని కొనసాగిస్తూనే రెగ్యులర్ ఖాళీ పోస్టులను భర్తీ చేయడానికి ఆమోదించారు. ఢిల్లీలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో మే 3 నుంచి 13వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని నిర్ణయం చేయడం జరిగింది. తిరుపతిలో నిర్మాణంలో ఉన్న శ్రీనివాస సేతు పనులను త్వరితగతిన పూర్తి చేసి జూన్ 15 నాటికి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించడం జరిగింది.’ అని వైవి. సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

Vijayawada: ఇంద్రకీలాద్రిపై మరో వివాదం.. ఉద్యోగికి మెమో జారీ

నెలకు రూ.100 చాలు.. స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోవచ్చు : సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

Advertisement

Next Story

Most Viewed