తిరుమల శ్రీవారి అన్న ప్రసాదంలో ‘జెర్రి’.. స్పందించిన టీటీడీ

by Jakkula Mamatha |
తిరుమల శ్రీవారి అన్న ప్రసాదంలో ‘జెర్రి’.. స్పందించిన టీటీడీ
X

దిశ ప్రతినిధి, తిరుపతి: తిరుమల మాధవ నిలయంలోని తాము తిన్న అన్న ప్రసాదంలో జెర్రి కనబడిందని ఒక భక్తుడు చేసిన ఆరోపణలు వాస్తవ దూరం అని టీటీడీ తెలియజేసింది. తిరుమల శ్రీవారి దర్శనార్థం వేలాదిమంది భక్తులకు వడ్డించడానికి పెద్ద మొత్తంలో టీటీడీ వారు అన్నప్రసాదాలు తయారుచేస్తారు. అంత వేడిలో ఏ మాత్రం చెక్కుచెదరకుండా ఒక జెర్రి ఉందని సదరు భక్తుడు పేర్కొనడం ఆశ్చర్యకరంగా ఉందని పేర్కొంది. ఒకవేళ పెరుగు అన్నాన్ని కలపాలంటే కూడా ముందుగా వేడి చేసిన అన్నాన్ని బాగా కలియబెట్టి తర్వాత పెరుగు కలుపుతారు. అటువంటప్పుడు ఏ మాత్రం రూపు చెదరకుండా జెర్రి ఉండటం అనేది ఇది పూర్తిగా కావాలని చేసిన చర్య మాత్రమే గా భావించాల్సి వస్తుంది. దయచేసి భక్తులు ఇటువంటి సత్యదూరం వార్తలు నమ్మకూడదని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

Advertisement

Next Story