TTD: శ్వేతపత్రం విడుదల చేస్తాం.. శ్రీవాణి ట్రస్ట్‌ నిధులపై ఈవో కీలక వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2023-06-22 14:11:40.0  )
TTD: శ్వేతపత్రం విడుదల చేస్తాం.. శ్రీవాణి ట్రస్ట్‌ నిధులపై ఈవో కీలక వ్యాఖ్యలు
X

దిశ,డైనమిక్ బ్యూరో : తిరుమల శ్రీవాణి ట్రస్ట్‌పై శ్వేతపత్రం విడుదల చేస్తామని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి వెల్లడించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో పీఠాధిపతులతో ధర్మారెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శ్రీవాణి ట్రస్ట్‌ నిధుల వినియోగంపై వస్తోన్న ఆరోపణలపై చర్చించారు. శ్రీవాణి ట్రస్ట్‌పై వస్తున్న ఆరోపణలను పీఠాధిపతులు, స్వామీజీలు ఖండించారు.

ఈ సందర్భంగా ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో టీటీడీ పాలకమండలి మంచి ఉద్దేశ్యంతో ఈ శ్రీవాణి ట్రస్టును ప్రారంభిందని తెలిపారు. కానీ దళారులు ఉండటం వల్ల శ్రీవాణి ట్రస్టు విరాళాలు తొలుత రాలేదని, అయితే దళారీల వ్యవస్థను తగ్గించడంతో విరాళాలు వస్తున్నట్లు చెప్పారు. శ్రీవాణి ట్రస్టు నిధులతో పలు ఆలయాల నిర్మాణం, పురాతన ఆలయాల పునరుద్ధరణ టీటీడీ చేపట్టినట్లు తెలిపారు. ఆదాయ పన్ను సెక్షన్‌ 12A ఆదాయపు పన్ను కమిషనర్‌ ద్వారా శ్రీవాణి ట్రస్టుకు రిజిస్ట్రేషన్‌ లభించిందని తెలిపారు. శ్రీవాణి ట్రస్టుకు ఆన్‌‌లైన్‌ ద్వారా 475.57 కోట్లు వచ్చిందని.. ఆఫ్‌ లైన్‌ ద్వారా 350.82 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు.

ఇవి కూడా చదవండి :: Palakollu: టిడ్కో ఇళ్లకు వైసీపీ రంగులు.. అధికారులను నిలదీసిన కేంద్రమంత్రి

Advertisement

Next Story