- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Adipurush Pre Release Event: దేశానికి గొప్ప పేరు తెచ్చేలా ‘ఆదిపురుష్’
దిశ, వెబ్ డెస్క్: ‘ఆదిపురుష్’ సినిమాను గొప్పగా నిర్మించారని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుపతిలో ‘ఆదిపురుష్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన పాల్గొన్నారు. రామాయణంలోని కొన్ని ప్రధాన ఘట్టాలను ఆధారంగా చేసుకుని ‘ఆదిపురుష్’ సినిమాను నిర్మించారని తెలిపారు. భారతదేశ ఫిల్మ్ ఇండస్ట్రీకి గొప్ప పేరు తీసుకొచ్చే విధంగా సినిమాను రూపొందించారని చెప్పారు. ‘బాహుబలి’ సినిమా హాలీవుడ్ స్థాయిలో భారత దేశానికి ఎంతో కీర్తిని తెచ్చిందన్నారు. అదే స్థాయిలో గ్రాఫిక్స్‌తో ‘ఆదిపురుష్’ సినిమా కూడా నిర్మించారని స్పష్టం చేవారు. రామాయణం, మహాభారతం భారతదేశ చరిత్రకు రెండు గొప్ప ఇతిహాసాలని చెప్పారు. అటువంటి రామాయణంలోని కొన్ని ఘట్టాలను తీసుకుని ‘ఆదిపురుష్’ సినిమాను నిర్మించడం గొప్ప కార్యక్రమమన్నారు. రామాయణాన్ని కళ్లకు కట్టినట్లు నిర్మించడం జరిగిందని చెప్పారు. యువతీయువకులకు ఈ సినిమా ఆదర్శంగా నిలుస్తుందని వైవీ సుబ్బారెడ్డి ఆకాంక్షించారు.