Tragedy: నీటి సంపులో పడి ముగ్గురు దుర్మరణం

by srinivas |
Tragedy: నీటి సంపులో పడి ముగ్గురు దుర్మరణం
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఉమ్మడి చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం పెడ్డకొండామారిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నీటి సంపులో ప్రమాదవశాత్తు ముగ్గురు మృతి చెందారు. సంపు శుభ్రం చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలడంతో ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ వైర్లు నీటిలో పడటంతో విద్యుత్ షాక్‌కు గురై ముగ్గురు మృతి చెందారు. అనంతరం మృతదేహాలను చౌడేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రి వద్ద మృతుల బంధువుల రోదనలతో మిన్నంటిపోయింది.

రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించారు. నీటి సంపులో పడి ప్రమాదవశాత్తు ముగ్గురు మృతి చెందడం బాధాకరమన్నారు. వారి కుటుంబాలను పరామర్శించడం జరిగిందని వెల్లడించారు. మృతుల కుటుంబాలకు పరిహారం కింద ఐదు లక్షలు, వైఎస్ఆర్ భీమా కింద మరో ఐదు లక్షలు అందిస్తాం అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. బాధితులను పరామర్శించిన వారిలో చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డప్ప సైతం ఉన్నారు.

Advertisement

Next Story