Tirupati: 150 కేజీల గంజాయి పట్టివేత.. ముగ్గురి అరెస్ట్

by srinivas |
Tirupati: 150 కేజీల గంజాయి పట్టివేత.. ముగ్గురి అరెస్ట్
X

దిశ, తిరుపతి: అంతరాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 20 లక్షల విలువైన 150 కేజీల గంజాయితో పాటు నాలుగు సెల్ ఫోన్లు, మహేంద్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వెంకటగిరి, సర్కిల్ ఏర్పేడులో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. మహేంద్ర వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 75 గంజాయి ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. అనకాపల్లి నుంచి కేరళ రాష్ట్రం త్రిశూల్ జిల్లాకు తరలిస్తున్నట్లు గుర్తించారు. నిందితులపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేశారు. తిరుపతిలో గంజాయిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story