Tirupati Mlc Elections: ఒకే వ్యక్తికి 11 ఓట్లు.. 11 మంది తండ్రులు

by srinivas |
Tirupati Mlc Elections: ఒకే వ్యక్తికి 11 ఓట్లు.. 11 మంది తండ్రులు
X

దిశ, తిరుపతి: ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి గెలుపు కొరకు అంతూ, పొంతులేని అప్రజాస్వామిక పద్ధతులకు వైసీపీ పాల్పడుతోందని, అది కాస్త పరాకాష్టకు చేరుకుందని సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి విమర్శించారు. తిరుపతిలో తమ కార్యకర్తల పరిశీలనలో రోజు, రోజుకు విస్తు గొలుపే వాస్తవాలు వెల్లడవుతున్నాయని వివరించారు. ప్రజాస్వామ్య దేశంలో ఇంతటి అప్రజాస్వామిక చర్యలు ఉంటాయా? అన్న అనుమానం కలుగుతోందన్నారు. తిరుపతి 221వ పోలింగ్ బూత్ పరిధిలో కేబిలేఔట్ నందు 6-19-57-354 ఇంటి నెంబరుతో 11 ఓట్లు ఒకే వ్యక్తి పేరుతో నమోదై ఉన్నాయని తెలిపారు. 760, 763, 765, 766, 768, 769, 770, 772, 773, 775, 778 సీరియల్ నెంబర్లలో ఎ. మణి పేరుతో ఓటరుగా 11 సార్లు నమోదు కావడమే కాకుండా, ఒక్కో నెంబర్ దగ్గర మణీకి తండ్రి పేర్లు 11 రకాలుగా పేర్కొన్నారని తెలిపారు. అధికార పార్టీ బోగస్ చర్యలకు ఇంతకంటే నిదర్శనం అవసరమా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీలుగా అధికార పార్టీ నాయకులు తప్పుడు మార్గంలో గెలవాలనుకుంటున్న వైనాన్ని పట్టభద్రులు, ఉపాధ్యాయులు అర్థం చేసుకోవాలని వైసీపీకి గుణపాఠం నేర్పించాలని కందారపు మురళి పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed