Heavy Rain: తిరుమలలో వడగండ్ల వాన

by srinivas |
Heavy Rain: తిరుమలలో వడగండ్ల వాన
X

దిశ, తిరుపతి: తిరుమలలో ఒక్కసారిగా ఉన్నట్టుండి వాతావరణం మారిపోయింది. భారీ వడగండ్ల వాన కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు, ఉక్కపోతలతో ఉక్కిరిబిక్కిరి చేయగా.. మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా వాతావరణంలో మార్పు చోటు చేసుకుంది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వడగండ్ల వర్షం కురుసంది. వర్షం కారణంగా భక్తులు తీవ్ర అవస్థలు పడ్డారు. శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులతో పాటు, దర్శనానంతరం ఆలయం వెలుపలికి చేరుకున్న భక్తులు వర్షం దాటికి షెడ్ల కిందికి పరుగులు తీశారు. చిన్నపిల్లలతో వచ్చిన తల్లిదండ్రులు వర్షం కారణంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. షాపింగ్ కాంప్లెక్స్, లోతట్టు ప్రాంతాల దుఖానాల్లోకి వర్షపు నీరు చేరడంతో వస్తువులు తడిసిపోవడంతో ఇబ్బందులు పడ్డారు.

Advertisement

Next Story