తిరుపతిలో దొంగ ఓట్ల కలకలం..ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు

by Jakkula Mamatha |   ( Updated:2024-05-13 12:47:25.0  )
తిరుపతిలో దొంగ ఓట్ల కలకలం..ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
X

దిశ ప్రతినిధి,తిరుపతి: తిరుపతిలో మరోసారి దొంగ ఓట్లు కలకలం రేపాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి దొంగ ఓట్లు వేయడానికి ప్రయత్నించిన ఐదుగురిని ఎన్డీఏ కూటమి నాయకులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన స్థానిక ఎన్జీవో కాలనీ లోని జగన్మాత స్కూల్ నందు జరిగింది. గతంలో వాలంటీర్లుగా పనిచేసి రాజీనామా చేసిన వ్యక్తులు వారి చేత ఓటర్ స్లిప్పులు నకిలీ ఐడీ కార్డులను ఇచ్చి ఓటు వేయడానికి పంపించారని సమాచారం. పోలింగ్ బూత్‌లో ఉన్న జనసేన పార్టీ ఏజెంట్లు అనుమానం వచ్చి వారిని నిలదీశారు. వారు సరైన సమాధానం చెప్పకపోవడంతో దొంగ ఓటర్లుగా గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ అభ్యర్థి ఆరని శ్రీనివాసులు సంఘటన స్థలానికి చేరుకొని ఎమ్మెల్యే భూమన అభినయ రెడ్డి పై మండిపడ్డారు. ఇక్కడ వైసీపీ నాయకులు దొంగ ఓట్లతో గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. ఓడిపోతామనే భయంతో దొంగ ఓట్లు వెయిస్తున్నారని ధ్వజమెత్తారు. తిరుపతి ప్రజలు తమ తీర్పును స్పష్టంగా ఇస్తున్నారని గెలుపు తమదేనని అన్నారు.

Read More..

ఏపీలో ఎన్నికల వేళ హింసాత్మక ఘటనలు.. స్పంధించిన మాజీ సీఎం చంద్రబాబు.. ఏమన్నారంటే..?

Advertisement

Next Story

Most Viewed