- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Karnataka లో డీజిల్ కొట్టించిన లోకేష్.. ఏపీలో రేట్లపై విమర్శలు
దిశ, తిరుపతి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్ర నాలుగో రోజు కొనసాగుతోంది. కర్ణాటక రాష్ట్రం పంతాన్‌హల్లికి పాదయాత్ర చేరుకుంది. లోకేష్ పాదయాత్రకు కర్ణాటక పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. పంతాన్‌హల్లి హెచ్ పెట్రోల్ బంక్‌లో ఆగిన టీడీపీ నేత... తన కాన్వాయ్ వాహనాలకు దగ్గరుండి డీజిల్ కొట్టించారు.
అనంతరం తానే స్వయంగా డబ్బులు ఇచ్చి ఏపీలో ఉన్న రేట్లకి కర్ణాటకలో ఉన్న పెట్రోల్, డీజిల్ రేట్లకి తేడా తెలుసుకున్నారు. పెట్రోల్, డీజిల్‌పై జగన్ రెడ్డి బాదుడే బాదుడు అని లోకేష్ మండిపడ్డారు. కర్ణాటకలో లీటర్ డీజిల్ రూ.88, పెట్రోల్ రూ.102 అని... ఏపీలో లీటర్ డీజిల్ రూ.99.27, రూ.పెట్రోల్ 111.50లుగా ఉందని... అంటే జగన్ రెడ్డి బాదుడు 10 రూపాయిలు అని చెప్పుకొచ్చారు. తనతో నడుస్తున్న ప్రజలకు, కార్యకర్తలకు రేట్ల తేడా గురించి వివరించారు. దేశం మొత్తంలో ఏపీలోనే ఎక్కువ రేట్లు ఉన్నాయంటూ పన్నుల భారం గురించి ప్రజలు, కార్యకర్తలకు లోకేష్ వివరించారు