- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Kuppam: అక్రమ కేసులపై చంద్రబాబు ఆగ్రహం.. ఎవరినీ వదిలి పెట్టమని హెచ్చరిక
దిశ, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన కుప్పంలో సభ నిర్వహించారు. కుప్పంలో గ్రానైట్ మాఫియా రెచ్చిపోతోందని మండిపడ్డారు. వైసీపీ నేతలు అక్రమంగా వందల కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. వైసీపీ నేతలు దోచుకున్నదంతా టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బయటకు తీస్తానని హెచ్చరించారు. ప్రజాధనాన్ని దోచుకుని విదేశాల్లో దాచి పెట్టుకుంటున్నారని ఆరోపించారు. జగన్ అవినీతి పరుడని బీజేపీ ఆగ్రనేతలే చెప్పారని, మరి ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని చంద్రబాబు ప్రశ్నించారు.
సంపద సృష్టిస్తేనే పేదలు ధనికులవుతారని చంద్రబాబు చెప్పారు. సంపద సృష్టి వల్ల ఆదాయం పెరుగుతోందని.. దాని వల్ల సంక్షేమ పథకాలు చాలా అమలు చేయొచ్చని తెలిపారు. తాను ఇళ్లు కట్టుకోవడానికి అనుమతి అడిగితే ఇప్పటి వరకూ పర్మిషన్ ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ జగన్ తండ్రిది.. తాతది కాదని, ఐదు కోట్ల ప్రజలదని వ్యాఖ్యానించారు. వైసీపీ నాయకులు కుప్పంలో రౌడీయిజం చేస్తున్నారని, తనపై కూడా దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. రౌడీలను ఎక్కడికక్కడ అణగదొక్కి.. తప్పుడు కేసులు పెట్టిన వారికి తగిన గుణపాఠం చెబుతామని చంద్రబాబు హెచ్చరించారు.