- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kuppam: తారకరత్నకు ప్రాణాప్రాయం తప్పింది!
- నిలకడగా తారకరత్న ఆరోగ్యం
- యాంజియోగ్రామ్ చేసి స్టంట్స్ వేసిన వైద్యులు
- మెరుగైన చికిత్సకోసం బెంగళూరుకు తరలింపు
- ఆస్పత్రి వద్ద బాలకృష్ణ, టీడీపీ నేతలు
- ఫోన్ చేసి సమాచారం తెలుసుకున్న చంద్రబాబు, జూ.ఎన్టీఆర్
దిశ, డైనమిక్ బ్యూరో: 'యువగళం' పాదయాత్రలో నందమూరి తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. 45 నిమిషాల పాటు స్పృహ కోల్పోయిన తారకరత్న అనంతరం వైద్య చికిత్సకు స్పందించారు. అనంతరం వైద్యులు యాంజియోగ్రామ్ నిర్వహించారు. అయితే గుండెలో ఎడమవైపు 90శాతం బ్లాక్ అయిపోవడతో స్టంట్స్ వేసినట్లు వైద్యులు తెలిపారు. ఆస్పత్రికి వచ్చినప్పుడు పల్స్ లేదని.. శరీరం బ్లూగా మారింది అని తెలిపారు. వెంటనే ట్రీట్‌మెంట్ మొదలుపెట్టినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం పల్స్ మొదలైందని స్టంట్స్ వేశామని ప్రస్తుతం నిలకడగా తారకరత్న ఆరోగ్యం ఉందని వైద్యులు చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తారకరత్న అనారోగ్యం పాలవ్వడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. జూనియర్ ఎన్టీఆర్, చంద్రబాబు, ఇతర కుటుంబ సభ్యులు బాలయ్యకు ఫోన్ చేసి సమాచారం అడిగి తెలుసుకుంటున్నారు. అయితే మెరుగైన చికిత్స నిమిత్తం తారకరత్నను బెంగళూరు తరలించనున్నట్లు తెలుస్తోంది.
బెంగళూరుకు తరలిస్తున్నాం: బాలకృష్ణ
ఇకపోతే తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై నందమూరి బాలకృష్ణ మాట్లాడారు. తారకరత్న కోలుకుంటున్నారని చెప్పుకొచ్చారు. బీపీ కంట్రోల్‌లో ఉందని.. అన్ని పారామీటర్స్ బాగున్నాయని మీడియాకు తెలిపారు. అన్ని రిపోర్టులు సక్రమంగా ఉన్నాయని.. అయితే గుండెలో ఎడమవైపు 90 శాతం బ్లాక్ అయినట్టు వైద్యులు తెలిపారని బాలకృష్ణ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కుప్పంలోని వైద్యులు మంచి చికిత్స చేశారని కొనియాడారు. అయితే తారకరత్నకు మెరుగైన చికిత్స నిమిత్తం బెంగళూరుకు తరలించనున్నట్లు బాలయ్య తెలిపారు. ఎయిర్ లిఫ్ట్ చేద్దామని అనుకున్నప్పటికీ, వాటిలో సరైన వైద్య పరికరాలు ఉండవని... అందువల్ల రోడ్డు మార్గంలో అంబులెన్సులో తీసుకెళ్లానని నిర్ణయించినట్లు బాలకృష్ణ స్పష్టం చేశారు. తారకరత్నక ఎలాంటి ప్రాణాపాయం లేదని.. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీస్తున్నారని బాలకృష్ణ వెల్లడించారు.
నిలకడగా తారకరత్న ఆరోగ్యం: ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి
యువగళం పాదయాత్రలో ఉన్న తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురయ్యారని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. తారకరత్న హార్ట్‌లో బ్లాక్స్ ఉన్నట్లు వైద్యులు గుర్తించినట్లు తెలిపారు. డాక్టర్లు ఎంతగానో శ్రమించి తారకరత్నకు ప్రాథమిక వైద్యం అందించారని, అనంతరం యాంజియోగ్రామ్ నిర్వహించినట్లు తెలిపారు. ఆసుపత్రికి వచ్చేటప్పటికి తారకరత్న ఆరోగ్య పరిస్థితి క్రిటికల్‌గా ఉన్నట్లు తెలిపారు. వైద్యులు ఎంతగానో కృషి చేసి తారక రత్న ఆరోగ్య పరిస్థితిని నిలకడగా తీసుకొచ్చారన్నారు. బాలకృష్ణ స్వయంగా ఉండి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై సమీక్షించారని..స్టంట్స్ వేయడంతో తారకరత్న స్పృహలోకి వచ్చినట్లు వెల్లడించారు. మెరుగైన చికిత్స నిమిత్తం బెంగళూరుకు తరలించే యోచనలో ఉన్నట్లు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు.