- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Tirupati: ఓట్లు పోతున్నాయి..దొంగ ఓట్లు వస్తున్నాయి?
దిశ, తిరుపతి: తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక నుంచి ఏపీ రాజకీయాల్లో దొంగ ఓట్లు అంశం పెద్ద ఎత్తున తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. తిరుపతి ఉపఎన్నికలో గెలిచేందుకు అధికార వైసీపీ పక్క నియోజకవర్గాల నుంచి దొంగ ఓటర్లని తీసుకొచ్చి ఓట్లు వేయించిందని..తిరుపతి పార్లమెంట్‌కు ఉపఎన్నిక పోలింగ్ జరుగుతుండగానే ప్రతిపక్ష టిడిపి నేతలు ఆరోపణలు చేశారు. అలాగే పోలింగ్ లైన్లలో నిల్చున్న పలువురు దొంగ ఓటర్లని మీడియా పట్టుకుంది.
అయితే ఈ దొంగ ఓటర్లని టీడీపీనే తీసుకొచ్చిందని వైసీపీ ఆరోపించింది. ఇక ఎవరు తీసుకొచ్చారనే అంశంపై వాస్తవాలు బయటపడలేదు గాని..దొంగ ఓట్లు మాత్రం పడ్డాయని అర్ధమైంది. ఆ తర్వాత ఆత్మకూరు ఉపఎన్నికలో అదే జరిగిందని, ఇక చంద్రబాబు సొంత స్థానం కుప్పం మున్సిపాలిటీ గెలిచేందుకు పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రం నుంచి దొంగ ఓటర్లని తీసుకొచ్చారని వైసీపీపై ఆరోపణలు వచ్చాయి. ఇక ఇప్పుడు కొత్తగా కొన్ని ఓట్లు పోవడం జరుగుతుంది. అదే సమయంలో ఒకే డోర్ నెంబర్‌లో వందల కొద్ది ఓట్లు నమోదు అవుతున్నాయి.
అయితే టీడీపీ ఓట్లు తొలగించి..కొత్తగా వైసీపీ దొంగ ఓట్లు సృష్టిస్తుందనేది టీడీపీ చేస్తున్న ఆరోపణ. అలాగే కుప్పం నియోజకవర్గంలోని ఓ ఊరులో వందల కొద్ది ఓట్లు తొలగించారని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక ఇలా ఓట్లు లేపేయడం, దొంగ ఓట్లు వస్తే..వచ్చే ఎన్నికల్లో గెలుపోటములు తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైనా ఎన్నికల అధికారులు దృష్టి సారించి దొంగ ఓట్లు నమోదు కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.