AP News:ఎన్నికల పై రాజకీయ పార్టీలు సహకరించాలి:జిల్లా ఎన్నికల అధికారి

by Jakkula Mamatha |
AP News:ఎన్నికల పై రాజకీయ పార్టీలు సహకరించాలి:జిల్లా ఎన్నికల అధికారి
X

దిశ ప్రతినిధి,తిరుపతి: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో స్వేచ్ఛాయుత వాతావరణంలో, నిష్పాక్షిక పారదర్శకంగా సాధారణ ఎన్నికలు జరిగేందుకు సహకరించాలని, ఓటర్లు ప్రశాంతంగా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా రాజకీయ పార్టీలు అందరూ సహకరించాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ మార్చి 16న విడుదలైన నేపథ్యంలో ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ ఈ నెల ఏప్రిల్ 18న విడుదల చేయబడుతుంది అని, నామినేషన్లు చివరి తేదీ ఏప్రిల్ 25 అని, నామినేషన్లు స్క్రూటినీ ఏప్రిల్ 26న ఉంటుందని, నామినేషన్ల ఉపసంహరణ 29 ఏప్రిల్, అలాగే పోలింగ్ మే 13 న ఉంటుందని, కౌంటింగ్ 4 జూన్ న ఉంటుందని తెలుపుతూ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేపడుతున్నామని తెలిపారు.

ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉందని, ఎన్నికల సంబంధింత స్టాటిక్ సర్వైలెన్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ తదితర బృందాలు ఏర్పాటై భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పని చేస్తున్నాయని తెలిపారు. నామినేషన్ ప్రక్రియ పై రాజకీయ పార్టీల ప్రతినిధులకు రెండవ దఫా అవగాహన కార్యక్రమాన్ని త్వరలో నిర్వహించనున్నామని తెలిపారు. నామినేషన్లు, ప్రచారం, పోలింగ్, కౌంటింగ్, ఎన్నికల యాప్ లపై త‌దిత‌ర‌ ఎన్నికల ప్రక్రియపై రాజకీయ పార్టీలకు గతంలో ట్రైనింగ్ ఇచ్చి ఉన్నారని గుర్తు చేస్తూ సువిధ యాప్ నందు దరఖాస్తు చేసుకున్న వాటిని నిర్దేశిత గడువులోపు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు పర్మిషన్ ఇవ్వడం జరుగుతోందని, తిరస్కరించబడిన వాటిపై అబ్జెక్షన్ ఉన్నచో అప్పుడే వాటిపై సంబంధిత అధికారులతో క్లారిఫై చేసుకోవాలని తెలిపారు. స్వేచ్చాయుత వాతావరణంలో పారదర్శకంగా ప్రజలు ఓటు హక్కును నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా రాజకీయ పక్షాలు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, డి ఆర్ ఓ పెంచల కిషోర్, ఈఆర్ఓ లు ధ్యానచంద్ర, అదితి సింగ్, కిరణ్ కుమార్, రవి శంకర్ రెడ్డి, నిశాంత్ రెడ్డి, చంద్రముని, నరసింహులు తదితర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story