- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'ఇదిగో చూడు జగన్...నేను తెచ్చిన డిక్సన్ కంపెనీ' అంటూ లోకేశ్ సెటైర్లు
- ఈ అక్కాచెల్లెళ్లు అందులో ఉద్యోగులే
- నువ్వు ఒక్క కంపెనీ అయినా తెచ్చానని చెప్పుకోగలవా?
- సీఎం జగన్‌ను ప్రశ్నించిన నారా లోకేశ్
దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర వినూత్న రీతిలో కొనసాగుతుంది. మొన్న పబ్జీ హోటల్ ఫోటో తీసి వైసీపీ ప్రభుత్వంపై సెటైర్లు వేసిన లోకేశ్ తాజాగా ఓ కంపెనీ బస్సును చూపిస్తూ ఆసక్తికరమైన ఫోటోలు షేర్ చేశారు. సత్యవేడు నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర జరుగుతుండగా డిక్సన్ కంపెనీ బస్సు కనిపించింది. ఆ బస్సులో మహిళా ఉద్యోగులు ప్రయాణిస్తున్నారు. దీంతో లోకేశ్ ఆ బస్సును..అందులోని మహిళా ఉద్యోగులను చూసి పరవశించిపోయారు.
నాలుగేళ్ల క్రితం వేలాదిమందికి ఉపాధి చూపా..
'నాలుగేళ్ల క్రితం తాను ఐటీ-ఎలక్ట్రానిక్స్ శాఖా మంత్రిగా తీసుకొచ్చిన కంపెనీ ఈ రోజు ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తోంది, ఇప్పుడు పదవిలో లేను. కానీ నా ప్రయత్నం వేలాది మంది జీవితాలకు ఉపాధి మార్గం చూపింది. రాష్ట్రానికి ఆదాయం తెచ్చే ఒక వనరు అయ్యింది. ఆంధ్రా అభివృద్ధిలో డిక్సన్ కూడా ఒక భాగమైంది.' అని లోకేశ్ చెప్పారు.
ఒక్క కంపెనీ అయినా తెచ్చావా..?
'చిలుకను పెంచాను ఎగిరిపోయింది. ఉడుతను పెంచాను. పారిపోయింది. మొక్కను పెంచాను. ప్రస్తుతం ఆ రెండూ వచ్చి చేరాయి' అని మిసైల్ మేన్, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్పిన సత్యాన్ని లోకేశ్ గుర్తు చేశారు. 'నేను ఏపీకి తీసుకొచ్చిన డిక్సన్‌లో ఈ అక్కాచెల్లెళ్లు ఉద్యోగానికి వెళ్లడం చూసి నా గుండె గర్వంతో ఉప్పొంగింది. అప్పట్లో డిక్సన్ రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టారు. ఈ కంపెనీ వల్ల 1000 మందికి ప్రత్యక్షంగా, 5000 మందికి పరోక్ష ఉపాధి దొరికింది. నేను పదులసంఖ్యలో కంపెనీలు తెచ్చి వేలాది మందికి ఉపాధి కల్పించాను. అన్ని కాకపోయినా ఒక్క కంపెనీ తెచ్చి యువతకి ఉపాధి కల్పించి చూపించగలవా మిస్టర్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డీ.' అని లోకేశ్ ప్రశ్నించారు.