తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై Junior NTR ఆవేదన

by srinivas |   ( Updated:2023-01-27 13:47:53.0  )
తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై Junior NTR ఆవేదన
X

దిశ, వెబ్ డెస్క్: నారా లోకేశ్ పాదయాత్రలో సినీ నటుడు నందమూరి తారక రత్న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తారకరత్నను బెంగళూరు ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. స్వయంగా బాలకృష్ణ దగ్గరుండి తారక రత్నకు చికిత్స చేయిస్తున్నారు. మరోవైపు తారక రత్న ఆరోగ్య పరిస్థితిపై నందమూరి కుటుంబ సభ్యులు ఆరా తీస్తున్నారు. అటు తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై జూనియర్ ఎన్టీఆర్ ఆవేదన చెందారు. ఆస్పత్రి వద్ద ఉన్న బాబాయ్ బాలకృష్ణకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తారకరత్నను ఆసుపత్రికి తరలించడం పట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. తారకరత్న త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Advertisement

Next Story