Breaking: ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో జబర్దస్త్ కమెడియన్ హరి

by srinivas |   ( Updated:2023-06-13 08:13:27.0  )
Breaking: ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో జబర్దస్త్ కమెడియన్ హరి
X

దిశ, వెబ్ డెస్క్: ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో జబర్దస్త్ కమెడియన్ హరి పేరు మరోసారి తెరపైకి వచ్చింది. చిత్తూరు జిల్లా పుంగనూరులో అటవీశాఖ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రూ.60 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు హరి మాత్రం స్పాట్‌లోనే పారిపోయారు. దీంతో హరి కోసం గాలిస్తున్నారు. గతంలోనూ ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ ఆయన పోలీసులకు పట్టుబడ్డారు. ఇప్పటికే హరిపై పలు సెక్షన కింద కేసులు నమోదు అయ్యాయి. కాగా జబర్దస్త్ షోలో లేడీ గెటప్స్ ద్వారా హరి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఎర్రచందనం స్మగ్లింగ్‌ కేసులో ఇరుక్కున్నాడు. హరికి పలువులు స్మగ్లర్లతో సంబంధాలున్నట్లు పోలీసులు గుర్తించారు.

Also Read: నాకు దానికి ఏ సంబంధం లేదు: స్మగ్లింగ్ వార్తలపై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ

Advertisement

Next Story