- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పేదల ఇల్లు కూల్చివేత.. అడ్డుకున్న బాధితుల అరెస్ట్
దిశ, డైనమిక్ బ్యూరో: చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణం నానాసాపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నాసాపేటలో ఉన్న సుమారు 20 పేదల ఇండ్లను పోలీసులు, మున్సిపల్ అధికారులు కలిసి శనివారం ఉదయం జేసీబీల సాయంతో కూల్చివేశారు. శనివారం ఉదయమే పేదల నివాసాల వద్దకు చేరుకున్న పోలీసులు, మున్సిపల్ అధికారులు ఇల్లు ఖాళీ చేయాలని ఆదేశించారు. అయితే పేదలు అంగీకరించలేదు. పోలీసులు, మున్సిపల్ అధికారుల తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగారు. వారికి టీడీపీ నేతలు అండగా నిలిచారు. అయితే పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
అనంతరం విద్యుత్ అధికారులు నాసాపేటకు చేరుకుని విద్యుత్ లైన్లు కట్ చేశారు. అంతేకాదు మీటర్లు సైతం తొలగించారు. అనంతరం అధికారులు ఇల్లు కూల్చివేశారు. తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేసన్‌కు తరలించడంతో పిల్లలు ఇంటి వద్ద దిక్కుతోచని స్థితిలో నిలుచుని ఉన్నారు. ఇల్లు ఎందుకు కూల్చివేస్తున్నారో.. తల్లిదండ్రులను ఎందుకు అరెస్ట్ చేశారో తెలియని ఆ చిన్నారులు గుక్కపెట్టి ఏడుస్తూ కనిపించారు. వారి ఏడుపు అందర్నీ కలచివేసింది.