- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tirumala News:తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్..!
దిశ,వెబ్‌డెస్క్:శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించేందుకు నిత్యం ప్రపంచ నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తిరుమలకు తరలివస్తారు. చాలా మంది భక్తి శ్రద్ధలతో కాలి నడక ద్వారా ఏడు కొండలు ఎక్కి తమ మొక్కులు చెల్లించుకుంటారు. ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తుల రాకతో తిరుమలలో రద్దీ నెలకొంటుంది. ఈ క్రమంలోనే శ్రీవాణి ట్రస్టు భక్తుల సౌకర్యార్థం టికెట్ల జారీ విషయంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఈ క్రమంలో శ్రీవాణి ట్రస్ట్ భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని టీటీడీ నిర్ణయించింది. శ్రీవారి దర్శనం కోసం బుక్ చేసుకునే శ్రీవాణి టికెట్ల సంఖ్యను టీటీడీ తగ్గించింది. ఆన్‌లైన్‌లో ప్రస్తుతం ఉన్న సంఖ్యలోనే టికెట్‌లను అందుబాటులో ఉంచగా ఆఫ్‌లైన్‌లో మాత్రం శ్రీవాణి టికెట్ల జారీ సంఖ్యను 1000కి తగ్గించింది. DFO కార్యాలయంలో శాశ్వత ప్రాతిపదికన టికెట్లు జారీ కౌంటర్లు, 200 మంది భక్తులు వేచి ఉండేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని అధికారులను టీటీడీ ఈవో ఆదేశించారు.