Puttur: బీహార్ ముఠా దిగింది... చిన్న పిల్లలు జాగ్రత్త!

by srinivas |
Puttur: బీహార్ ముఠా దిగింది... చిన్న పిల్లలు జాగ్రత్త!
X

దిశ, పుత్తూరు: చిత్తూరు జిల్లా పుత్తూరులో చిన్న పిల్లలను అపహరించే ముఠా సంచరిస్తోంది. ఈ ముఠా కొన్ని ప్రాంతాల్లో ఉంటూ అదును చూసి వీధుల్లో ఆడుకుంటున్న పిల్లలను అపహరించి బయట రాష్ట్రాల్లో విక్రయిస్తున్నారు. ఇలాంటి ముఠాను పుత్తూరులో స్థానికులు గుర్తించి పట్టుకున్నారు. పుత్తూరు పాత తిరుపతి రోడ్డు నందు ఎనిమిది సంవత్సరాల బాలుడికి మత్తుమందు ఇచ్చి అపహరణకు గురి చేస్తుండగా ఓ వ్యక్తిని స్థానికులు పట్టుకున్నారు. దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నిందితుడు బీహార్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ముఠాలో ఇంకా కొంతమంది ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పుత్తూరు రైల్వే స్టేషన్, బస్టాండు పరిసర ప్రాంతాల్లో పోలీసులు విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. కొత్తగా ఎవరైనా కనిపిస్తే సమాచారం ఇవ్వాలంటూ పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story