టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ కి భద్రతా ఉందా?: మాజీ మంత్రి బండారు సత్య నారాయణమూర్తి

by Javid Pasha |
టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ కి భద్రతా ఉందా?: మాజీ మంత్రి బండారు సత్య నారాయణమూర్తి
X

దిశ, ఉత్తరాంధ్ర: టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ కి భద్రత ఉందా అని మాజీ మంత్రి బండారు సత్య నారాయణమూర్తి ప్రశ్నించారు. జిల్లా తెలుగుదేశం కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రతి హిందువుకి ఆరాధ్యదైవం తిరుపతి వేంకటే శ్వరుడు ప్రతి ఒక్కరూ నియమ నిష్ఠలతో పూజిస్తారు అటువంటి ప్రాంతాన్ని బాలాజీ సిటీగా చేద్దామని ఎన్టీఆర్ ప్రయత్నించారన్నారు. మేము నమ్ముకున్న దైవానికి అపచారం చేస్తే ఊరుకొము మా ఆరాధ్య దైవం కోసం అవసరం అయితే జైలుకి వెళ్ళడానికి వెన కాడమని అన్నారు. వైసీపీ ప్రభుత్వం 2019లో శ్రీవాణి ట్రస్ట్ పెట్టింది 10 వేల రూపాయల టికెట్ తెచ్చారు. 500 టికెట్ 10 వేల టికెట్ వేరు వేరు గా ఎందుకు ఇస్తున్నారుని ప్రశ్నించారు. తానుకుటుంబంతో వెళ్ళినప్పుడు 30 వేలు ఇచ్చి టికెట్లు కొన్నాను కాని తనకు ఎటువంటి రశీదు ఇవ్వలేదన్నారు.

దేవుని ఖాతా ఉన్నప్పుడు శ్రీవాణి ట్రస్ట్ అనే పేరు ఎందుకు పెట్టారు.. ట్రస్ట్ గా ఉన్న భద్రత ఏమిటి ఎన్ని టికెట్లు అమ్ము తున్నారొ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంత వచ్చిందో ఎపుడు చెప్పలేదు ఎక్కడ జమ చేస్తున్నారో చెప్పలేదు నాలుగేళ్లుగా ఎన్ని టికెట్లు అమ్మారు ఎవరు కొన్నారు వివరాలు తెలియజేయా లన్నారు. నాలుగేళ్లలో నాలుగు వేల కోట్లు వసూలు చేసుంటారు ప్రతి రూపాయి ఖాతాలో జమ అవ్వాలని కాగ్ కూడా చెప్పింది మిగతా వాటికి విరాళాలు ఇవ్వొచ్చు కానీ దర్శనం టికెట్లు టీటీడీకి వెళ్ళాలి కామన్ గుడ్ ఫండ్ ద్వారా దేవా లయాలకు నిధులు ఇచ్చారు దేవుని సొమ్ము కొట్టేయాడానికి ట్రస్ట్ లు పెట్టకూడదన్నారు. గతంలో తిరుమల కొండల గురించి అపహాస్యం చేసిన వారు ఏమయ్యా రో అందరికి తెలుసన్నారు. జగన్ కుటుంబం నుండి ఈ దోపిడీని ఆపాలని అన్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి విషయంలో రాజకీయాలు వద్దు బెదిరిస్తే బయ పడేది లేదు ఏడు కొండల వాడికోసం దేనికైనా సిద్ధమని చెప్పారు. బ్రహ్మో త్సవాల్లో జగన్ ఎందుకు భార్యతో కలిసి వెళ్ళలేదని ప్రశ్నించారు.

తిరుపతి వెంకన్న పై జగన్ కు నమ్మకం లేదు విశాఖ ఎంపీ కుటుంబం కిడ్నాప్ అయితే ఇంతవరకు సీఎం జగన్ కనీసం మాట్లాడలేదు. ఏపీ నుంచి అనేక కంపెనీలు వెళ్లి పోయాయి. స్వంత ఎంపీ వెళ్లి పోవడంలో ఆశ్చర్యం ఏముంది జగన్ పాలనలో సామాన్యులు కూడా వెళ్లిపోయే పరి స్థితులు ఉన్నాయన్నారు. హోంశాఖ మంత్రి కనీసం పరామర్శించక పోవడం దారుణమన్నారు. ఎంపీ ఏంవివిని వైసీపీలో కొందరు వేధిస్తున్నారనేది వాస్తవం రౌడీషీటర్ మూడు రోజులు రాకపొతే పోలీసులు దృష్టి సారించాలనన్నారు. ఎందుకు దృష్టి పెట్టలేదొ డిజిపి చెప్పాలి హైదరాబాద్ లో ఓ ఇంటి లో తీవ్రవాదులు ఉంటే ఇంటెలిజెన్స్ ద్వారా పట్టుకున్నారు ఏపీలో ఇంటె లిజెన్స్ పూర్తిగా ఫెయిల్ అయ్యిందన్నారు. ఏపీలో గంజాయి డ్రగ్స్ విచ్చల విడిగా ఉంటే డీజేపీ లేదంటారు ఎమ్మెల్సీ ఆనంతబాబు ఎలా పెద్ధో డయ్యాడని ప్రశ్నింన్నారు. ఆనంతబాబు గంజాయి మత్తులో డ్రైవర్ ని డోర్ డెలివరీ చేసాడు గంజాయి మత్తు లోనే రాష్ట్రంలో అనేక అకృత్యాలు జరుగుతున్నాయని బండారు ఆరోపించారు.

Advertisement

Next Story