TTD: ఆర్జిత సేవా టికెట్ల కోసం భక్తుల తీవ్ర ఇబ్బందులు

by srinivas |   ( Updated:2023-02-22 15:53:36.0  )
TTD: ఆర్జిత సేవా టికెట్ల కోసం భక్తుల తీవ్ర ఇబ్బందులు
X

దిశ, తిరుమల: ఆన్‌లైన్‌లో తిరుమల శ్రీవారి ఆర్జిత సేవాటికెట్ల జారీకి సంబంధించి సాంకేతిక సమస్యలు తలెత్తడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మార్చి, ఏప్రిల్‌, మే నెలలకు సంబంధించిన కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవల టికెట్లను ఈరోజు సాయంత్రం 4గంటలకు తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. అయితే టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో టికెట్లు బుక్‌ చేసుకోవడంలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా వెబ్‌సైట్‌ తరచూ హ్యాంగ్‌ అవడం, ఓపెన్‌ కాకపోవడంతో భక్తులు విసిగెత్తిపోయారు. టీటీడీ అధికారులు సరైన ఏర్పాట్లు చేయాలని కోరారు.

Advertisement

Next Story