- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Srikalahasti: అడ్డదారి దర్శనాలకు అడ్డుకట్ట
దిశ, తిరుపతి: దక్షిణ కాశీ శ్రీకాళహస్తి శివాలయానికి రోజురోజుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివెళ్తున్నారు. దీంతో కొంతమంది సెక్యూరిటీ సిబ్బంది, హోంగార్డులు దళారుల అవతారమెత్తారు. అడ్డదారి దర్శనాల పేరుతో భక్తులను మోసగిస్తున్నారు. భక్తుల వద్ద అధిక సంఖ్యలో నగదు వసూలు చేస్తున్నారు. ఈ విషయం ఆలయ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు దృష్టికి వెళ్లడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికంగా ఉన్న కొంతమంది యువత పార్కింగ్ వద్ద భక్తులను మోసగిస్తూ కాలం గడుపుతున్నారని, కొద్దిరోజులుగా తమకు ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు. అయితే అలాంటి వారిపై నిఘా పెట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామన్నారు. అన్ని ప్రాంతాల్లో సిబ్బంది జవాబుదారితనంతో విధులను నిర్వహించే విధంగా చర్యలు చేపడుతున్నామని అంజూరు తారక శ్రీనివాసులు చెప్పారు.
భక్తులతో కిక్కిరిసిన శివయ్య సన్నిధి
వరుస సెలవులు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామి అమ్మవారి దర్శించుకుంటున్నారు. అలాగే రాహు కేతు పూజలు, వివిధ రకాల అభిషేకాలు చేస్తున్నారు. అయితే భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు.