- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అర్చకుడు ఇంట్లో జింక చర్మం
దిశ, డైనమిక్ బ్యూరో: ఓ అర్చకుడు నివాసంలో జింక చర్మం లభించడం కలకలం రేపుతోంది. కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలోని గిడ్డంగి, అన్నదాన సత్రంలో పనిచేస్తున్న సిబ్బంది చేతివాటం ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ఆలయ ఈవో వెంకటేశు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సిబ్బంది ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో అనుబంధ ఆలయమైన వరదరాజులస్వామి ఆలయ అర్చకుడు కృష్ణమోహన్ నివాసంలో సోదాలు జరుపుతుండగా జింకచర్మాన్ని పోలీసులు గుర్తించారు.దీంతో ఈవో వెంకటేశు అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. డీఎఫ్‌వో చైతన్య కుమార్‌రెడ్డి ఆదేశాలతో అటవీశాఖ అధికారులు అర్చకుడు కృష్ణమోహన్ నివాసానికి చేరుకుని జింక చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కృష్ణమోహన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే జింక చర్మాన్ని తాను కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. అయితే కృష్ణమోహన్‌కు జింక చర్మాన్ని విక్రయించిన వ్యక్తి కోసం ఎఫ్ఆర్‌వో బాలకృష్ణారెడ్డి బృందంగా గాలిస్తున్నారు.